కళ్యాణదుర్గం: కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి: కళ్యాణదుర్గంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్
పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలో పారిశుద్ధ కార్మికులతో కలిసి సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. కనీస వేతనం నెలకు 26000 ఇవ్వాలన్నారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ నుంచి 20 మంది కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. అందరికీ ఏఐటీయూసీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.