బాన్సువాడ: బీర్కూర్ ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేందర్
బీర్కూర్ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా మహేందర్ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు ఎస్సైగా పనిచేసిన రాజశేఖర్ బదిలీపై కామారెడ్డికి వెళ్ళారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది మహేందర్‌కు ఘన స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.