మంత్రాలయం: సొసైటీ అధ్యక్షులను పెద్ద కడబూరు మండల సర్వసభ్య సమావేశంలో వేదిక పైకి ఆహ్వానించాలని పట్టుబట్టిన హనుమాపురం ఎంపీటీసీ
పెద్ద కడబూరు: మండల కేంద్రంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో హనుమాపురం ఎంపీటీసీ నరవ శశిరేఖ సొసైటీ అధ్యక్షులను వేదికపైకి ఆహ్వానించాలని పట్టుబట్టారు. గత వైసీపీ హయాంలో వారిని వేదికపై కూర్చోబెట్టినప్పటికీ, ఇప్పుడు ప్రోటోకాల్ పేరుతో తప్పించడం సరికాదన్నారు. బడుగు వర్గాలను చిన్నచూపు చూడొద్దని ఎంపీడీవోకు హితవు పలికారు.