నంద్యాల జిల్లా మహానందిలో శనివారం నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మహానందీశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన వారికి అధికారులు స్వాగతం పలికారు. వారు శ్రీ కామేశ్వరిదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం వారికి స్థానిక అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.