కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే మద్యం, ఇసుక, మట్టి లను దోపిడి చేస్తున్నారు: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ రంగయ్య
కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు తన పార్టీ శ్రేణులతో మద్యం, ఇసుక, మట్టి లను దోపిడీ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య తీవ్రంగా ఆరోపించారు. కళ్యాణదుర్గంలో బుధవారం ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 12:30 సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.మద్యం దోపిడీకి పాల్పడుతూ తానే ప్రజలకు సొంత డబ్బులిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అన్నింటికీ త్వరలోనే ప్రజలే సమాధానం చెబుతారన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు.