ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుండి తాడిపత్రి కి వేప నూనెతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్, అనంతపురం నుంచి రాజమండ్రి కి టమాట లోడ్ తో వెళ్తున్న మినీ లారీ ఢీకొన్నాయి. ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవరు లారీలోనే సజీవ దహనం అయ్యాడు. మినీ లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతుడు విశాఖపట్నంకు చెందిన దుర్గారావుగా గుర్తించినట్లుగా ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. పోస్టుమార్టం కోరకు మృతదేహాన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.