కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బీజేపీ చిన్న మల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ఆయన చేసిన సేవలని కొనియాడారు.