గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట శివారులో గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన టిప్పర్, 16 గొర్రెలు మృతి, రూ.1.50లక్షలు నష్టం
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో 67వ నంబర్ జాతీయ రహదారిపై గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లి 16 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. బాధిత రైతు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు కిట్ట, సంజప్ప, రామాంజనమ్మ, లక్ష్మీదేవిలు గొర్రెల పెంపకంతో జీవనం సాగించేవారు. ఈ క్రమంలో శనివారం గొర్రెలను మేపేందుకు మామిళ్ళచెరువు వైపునకు వెళ్తూ జాతీయ రహదారి దాటుతుండగా గుత్తి వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా వచ్చి గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. గొర్రెలు మృతితో రైతులకు రూ.1.50లక్షలు నష్టం వాటిల్లింది.