అనంతపురం నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో స్థలాల కోసం మహిళల బాహాబాహి
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
అనంతపురం నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో నివేషణ స్థలాల కోసం మహిళలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తీవ్ర దుమారం రేపారు.. నగర శివారులోని ఉప్పరపల్లి గ్రామ పరిధిలోని 215 సర్వేనెంబర్ లో ఒక్కొక్కరితో డబ్బులు వసూలు చేసి ఇళ్ల స్థలాలను అందించారని, ప్రస్తుతం వాటికి సంబంధించి తమ స్థలం తమ స్థలం అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.