చందంపేట: డిండి మండలంలో రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ నియోజకవర్గం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఆలయంలో ప్రాజెక్టు పేరిట వేల కోట్లు ఖర్చు చేసి, ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కనీసం ప్రాజెక్టుకు నీటి వార్డు సాధించలేకపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.