ఇబ్రహీంపట్నం: కిస్మత్పూర్ బ్రిడ్జి కింద యువతి మృతదేహం లభ్యం, వివరాలు తెలిపిన సీఐ క్యాస్ట్రో
కిస్మత్పూర్ బ్రిడ్జి కింద యువతి మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ క్యాస్ట్రో మంగళవారం మధ్యాహ్నం వివరాలను మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతిని మూడు రోజుల క్రితమే హత్య చేసి ఇక్కడ పడేసినట్లు ఉందని అన్నారు. యువతి వయసు 25 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉంటుందని ఒంటిమీద బట్టలు కూడా లేవని సిసి పుట్టేజ్ ను పరిశీలిస్తున్నామని అన్నారు. యువతిపై ఎవరైనా అత్యాచారం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.