అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో పలువురు మంత్రులను కలుస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృతమై తిరిగి స్వంత పార్టీలో చేరిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ లో పలు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. బుధవారం సెక్రటేరియట్ లో జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లను ఇటీవల పార్టీలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి లు కలిసి శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.