కొత్తచెరువులో టపాసుల నిప్పురవ్వ పడి గుడిసె దగ్ధం
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని గాంధీనగర్ వీధిలో మంగళవారం తెల్లవారుజామున బాల అచ్చమ్మకు చెందిన గుడిసె పూర్తిగా కాలిపోయింది. దీపావళి సందర్భంగా యువకులు టపాసులు కాల్చగా, నిప్పురవ్వలు గుడిసెపై పడడంతో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదని స్థానికులు తెలిపారు.