సూళ్లూరుపేటలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం
- రెండవ రోజు పరిసరాల పరిశుభ్రత చేపట్టిన మున్సిపల్ సచివాలయ పారిశుద్ధ సిబ్బంది
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అప్పటివరకు జరిగే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూళ్లూరుపేట పట్టణంలోని CTU యూనిట్స్ శుభ్రం చేశారు. అనంతరం సూళ్లూరు, నాగరాజపురం ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ మాట్లాడుతూ పుర వీధిలో చెత్త వేయరాదని అటులనే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల శుభ్రం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వర్లు, సచివాలయ పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది శానిటరీ