కలకడ ఆదర్శ పాఠశాలలో గత ప్రిన్సిపల్ పై వచ్చిన పిర్యాదులపై విచారణ చేపట్టిన డిఈఓ సుబ్రహ్మణ్యం
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కలకడ పట్టణంలోని ఆదర్శ పాఠశాల నందు గతంలో పనిచేసి బదిలీపై చిన్నమండెం వెళ్లిన ప్రిన్సిపల్ మల్లం షా పై అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం శనివారం విచారణ చేపట్టారు. గతంలో విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డించడంపై ఆ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ రమేష్ నాయుడు మరియు సభ్యులు డిఈఓ కు, ఆర్ జె డి కి ఫిర్యాదు చేశారు.దీనిపై గతంలో మదనపల్లి డి వైఈ ఓ లోకేశ్వర్ రెడ్డి విచారణ చేసి వెళ్లారు. ఉపాధ్యాయులను, ఎస్ఎంసి చైర్మన్ మరియు సభ్యులను విడివిడిగా విచారించారు