అనపర్తి: నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగంపేట బిక్కవోలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులు, కళా వేదికలు, సచివాలయ భవనాలు, వాటర్ ట్యాంక్, ఇంటింటికి కొళాయిలను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.