నగరి: నగరి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించిన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్
నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను సోమవారం ఎమ్మెల్యే నివాసంలో పలు మండలాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి అందజేశారు. ఎమ్మెల్యే వినతులను స్వీకరించి, సమస్యల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.