చిన్న పిల్లల సంరక్షణలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక సాంకేతికతో కూడిన స్మార్ట్ ఫోన్ లు ఇస్తున్నదని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గంలోని 323 అంగన్వాడీ కేంద్రాలకు సూపర్వైజర్ లకూ కలిపి మెత్తం 338 మంది కి సిడిపిఓ లు లీలా పద్మావతి, నాగమణి తో కలిసి ఈ ఫోన్ లను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధి వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీ లను మెయిన్ సెంటర్లుగా మార్చిన విషయం గుర్తు చేశారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 17 కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారాయని వివరించారు.