రాయదుర్గం: పట్టణంలోని పోలీసు స్టేషన్ ఆవరణలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు గుర్తు చేసుకుని వారిని స్మరించుకుందాం అని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ అన్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని పోలీసు స్టేషన్ వద్ద అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఘనంగా నివాళులు అర్పించారు. సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజా సేవలో 24 గంటలూ పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. నేర నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించి అండగా నిలవాలని కోరారు.