శంకరంపేట ఏ: నాగమడుగులో వ్యక్తి గల్లంతు, కొనసాగుతున్న గాలింపు చర్యలు
నాగమడుగులో వ్యక్తి గల్లంతు, కొనసాగుతున్న గాలింపు చర్యలు బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళుతుండగా మంజీరా నది నీళ్లలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ శివారులోని నాగమడుగులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (35) అచ్చంపేట్ లోని అత్తవారింటికి వచ్చాడు. తిరిగి తన స్వంత గ్రామానికి నాగమడుగు దాటుతుండగా నీటిలో గల్లంతయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.