రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అనంతపురం నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పిజిఆర్ఎస్, ఏపీ సేవ పోర్టల్ / మీ సేవ, మ్యుటేషన్లు, హౌస్ సైట్ అప్లికేషన్లు, రీసర్వే, భూ సేకరణ, సివిల్ సప్లయిస్, రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే ఎడి, సిఎస్డిటిలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలో ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.