అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో జోరుగా టపాకాయల విక్రయాలు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టపాకాయల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ పట్టణంలోని మేకల మార్కెట్ లో వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రజలను ఆకర్షించే విధంగా దుకాణాలతో పాటు ఆఫర్లను వారు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో టపాసుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.