గంగవరం మండలంలో పిఓ స్మరణ రాజ్ అకస్మిక తనిఖీలు:ఉద్యోగులు సకాలంలో ఆఫీస్‌లకు రావాలని సూచించిన పిఓ
గంగవరం మండలంలో ఐటిడిఏ పిఓ స్మరణ రాజ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయాన్ని ITDA PO స్మరణ్ రాజ్ తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. రంపచోడవరం డివిజన్లోని ప్రతి కార్యాలయంలో సిబ్బంది సమయానికి హాజరుకావాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు.