గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం వెంకటాపురంలో మాజీ సర్పంచ్‌కి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నివాళి
ఎస్ఆర్ పురం మండలం వెంకటాపురంలోని మాజీ సర్పంచ్ చంద్రగిరి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శనివారం వెంకటాపురం చేరుకుని మాజీ సర్పంచ్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమితీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాదిత కుటుంబ సభ్యులు చంద్రగిరి తంభయ్య సోదరులు, సర్పంచ్ సతీమణిని ఓదార్చారు.