సిర్పూర్ టి: కడంబ గ్రామంలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన పత్తి పంట, నష్టపరిహారం అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు
కాగజ్ నగర్ మండలం కడంబ గ్రామంలోని కౌలు రైతు నాన్న బోయిన శ్రీశైలం యాదవ్ వేసిన రెండెకురాల పత్తి పంట భారీ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పులు తీసుకువచ్చి పత్తి పంట వేస్తే పూర్తిగా కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం వాటిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించాలని రైతు శ్రీశైలం కోరారు,