తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఘట్టమైన పంచమి తీర్థానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందని వారి విధులు కచ్చితంగా నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నిగా మధ్య పంచమి తీర్థం విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.