వర్ని: ఉమ్మడి వర్ని మండలంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా
పెన్షన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వర్ని మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయాల ఎదుట వికలాంగులు ధర్నా నిర్వహించారు. వర్ని, చందూర్, రుద్రూర్, కోటగిరి మండలాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్లకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6వేల రూపాయలు వితంతువులకు, వృద్ధులకు 4 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.