జగిత్యాల: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సేవాసమితి అధ్యక్షులుగా అనుపురం చిన్న లింబాద్రి గౌడ్, ఎమ్మెల్యే అభినందనలు
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సేవాసమితికి ఇటీవల జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల్లా లావణ్య, సీనియర్ నాయకులు రొట్టె శ్రీధర్, పాత్రికేయులు అనుపురం లింబాద్రిగౌడ్, మామిడి గంగారాజం తదితరులు పాల్గొన్నారు.