తలమడుగు: మండల తహసీల్దార్ కార్యాలయం, వసుంధర మండల సమైఖ్య కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజార్షి షా
తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయాన్ని , ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగంగా వసుందర మండల సమైఖ్య కుట్టు మిషన్ కేంద్రంను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు.అంతకముందు అదనపు కలెక్టర్ శ్యామల దేవి తో కలిసి కొమురం భీం, అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.గ్రామానికి వచ్చిన కలెక్టర్ కు మేళతాళాలతో, భాజా భజంత్రీలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రత్యేక పూజలు చేశారు.