భూపాలపల్లి: గిరిజన హాస్టల్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక గురుకుల హాస్టల్ లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ గత ఐదు రోజులుగా నిరవదిక సమ్మె చేపట్టిన కార్మికులకు మంగళవారం ఉదయం 11 గంటలకు మద్దతు తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని,వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు వేతనాలతో పాటు పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని ఆందోళనలు కొనసాగిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర.