సర్వేపల్లి: విరువూరు ఇసుక రీచ్ లో చిక్కుకున్న రెండు ట్రాక్టర్లు, సురక్షితంగా బయటకు వచ్చిన డ్రైవర్లు
ఇసుక కోసం రీచ్ కి వెళ్ళిన రెండు ట్రాక్టర్లు వరద నీటిలో చిక్కుకున్న ఘటన పొదలకూరు మండలం విరువూరులో చోటు చేసుకుంది. ఇసుక రీచ్ లో నీటి ఉధృతికి రెండు ట్రాక్టర్లు మునిగిపోయాయి. సంగం బ్యారేజ్ నుంచి నీటిని వదులుతున్నట్లు అధికారులు సైరన్ మోగించినా ట్రాక్టర్ డ్రైవర్లు పట్టించుకోలేదు. ఇసుక లోడ్ చేస్తున్న క్రమంలో వరద నీరు చుట్టుముట్టింది. దీంతో భయభ్రాంతులకు గురైన ట్రాక్టర్ డ్రైవర్లు ఒడ్డుకు చేరారు. ట్రాక్టర్లు మాత్రం ఇంకా రీచ్ లోనే ఉండిపోయాయి