చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర నియామకం
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు ఏ. ఎం.నరేంద్ర గారు చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నియమితులయ్యారు . ముఖ్యంగా టూరిజం పై అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడమే కాకుండా అనేక పత్రాలను ముద్రించారు. ముఖ్యంగా విద్యారంగంలో విశేష అనుభవం తో పాటు సామజిక పరమయిన అనుభవం దృష్ఠ్య ఆయన సేవలను గుర్తించి జిల్లాస్థాయి భాద్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆయన నియామకం పట్ల కళాశాలలోని అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు కళాశాల సీపీడీసీ సభ్యులు పట్టణం లోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.