తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి ఏడు రోజుల్లో 21మంది అభ్యర్థులు 28నామినేషన్ పత్రాలు సమర్పించారు: ఆర్డీవో కె.చెన్నయ్య.
సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు స్వీకరణ ఆఖరి రోజు గురువారం 15, మంది అభ్యర్థులు 16 నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య తెలిపారు.ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఆర్డీవో చెన్నయ్య మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఏడు రోజులలో 21, మంది అభ్యర్థుల నుండి 28, నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి మురళీకృష్ణ, కార్యాలయం ఏవో ఎల్ నరసింహారావు సిబ్బంది పాల్గొన్నారు.