రాయదుర్గం: మాల్యం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న వేదవతి-హగరి నది, రాకపోకలు నిలిపివేత
కనేకల్ మండలం మాల్యం వద్ద వేదవతి నదికి వరద పోటెత్తింది. మంగళవారం వేకువజాము నుంచి ఒక్కసారిగా నదికి వరద పోటెత్తింది. నిన్నటి వరకు ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు మాత్రమే రాకపోకలు కొనసాగాయి. నదీ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున, ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, హొన్నూరు ఉరుసు ఉత్సవానికి వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.