సర్వేపల్లి: కేంద్ర బలగాల బందోబస్తు నడుమ సాయంత్రం వరకు నెల్లూరులో జరిగిన ఐటీ సోదాలు
నెల్లూరులోని ఆచారి వీధిలో ఉన్న రెండు బంగారు దుకాణాలతో పాటు వ్యాపారుల నివాసాలలో ఏకకాలంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి.. బంగారు బిస్కెట్లను హోల్సేల్ లో అమ్మకాలు సాగిస్తున్నారన్న సమాచారంతో.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి విక్రయాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఐటీ దాడులతో వ్యాపార వర్గాలలో కలకలం రేగింది.