గంగాధర నెల్లూరు: జీడి నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ సమావేశం
GD నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనిత ఆధ్వర్యంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. 104 అంబులెన్స్‌లను మందుల కొరతతో రోగులకు ఎలా వైద్యం చేయాలని, పాపిరెడ్డిపల్లి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని, కారణం ఏంటో.. జవాబు చెప్పాలని నేతలు పట్టుబట్టారు. ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహశీల్దారు శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, పీఎసీ చైర్మన్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.