నెల్లూరుజిల్లా, ఇందుకూరుపేట మండలం బిజెపి మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జనతావారధి, ప్రతి ఇంటికి స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ఇన్చార్జి ఆలూరు నాగవేణి పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా స్వదేశీ వస్తువుల వాడకంపై దుకాణదారులకు, ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. విదేశీ వద్దు స్వదేశీ ముద్దు