పొదలకూరు - రాపూరు మధ్య కల్వర్టు కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. అధికారులు కృషి తో రాకపోకల పునరుద్ధరణ చేశారు.ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఆర్&బీ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తెల్లవార్లూ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. డేగపూడి రాజుపాళెం వద్ద కల్వర్టు కూలిన ప్రాంతంలో పైపులు వేసి బుధవారం వేకువజామున రాకపోకలు పునరుద్ధరించారు