మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కృష్ణపట్నం గ్రామంలోని తుఫాను షెల్టర్ లో మహిళలకు కుట్టు శిక్షణ ఉత్పత్తి కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముత్తుకూరు మండల కేంద్రంలో దాదాపు 7 కోట్ల 50 లక్షలతో మోడరన్ స్కూల్ నిర్మించేందుకు బిపిసిఎల్ కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ముత్తుకూరు, కృష్ణపట్నం మేజర్ గ్రామపంచాయతీలను ఆదాని కృష్ణపట్నం పోర్టు వారు దత్తత తీసుకొని ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించారను తెలిపారు.