గిద్దలూరు: కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలలో పర్యటించిన 20 సూత్రాల కమిటీ చైర్మన్ దినకర్
ప్రకాశం జిల్లా కంభం, అర్ధవీడు, బెస్తవారిపేట మండలాలలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఏపీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ పర్యటించారు. కంభం చెరువును సందర్శించేందుకు చెరువు విస్తీర్ణం చూసి ఆయన ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన కంభం చెరువును అభివృద్ధి చేస్తామని అన్నారు. రహదారుల అనుసంధానం మరియు చెరువు అభివృద్ధి తదితర అంశాలపై ఆయన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ తో చర్చించారు. అర్ధవీడుకు చెందిన త్యాగరాజుకు సరైన గుర్తింపు లభించలేదని ఆయనకు ఈ ప్రాంతంలో గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తామన్నారు.