ప్రకాశం జిల్లాలో ఇద్దరు సీఐలకు స్థానచలనం చేయడంతో పాటు మరో సిఐకి అదనపు బాధ్యతలను ఆదివారం అప్పగించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ పాండురంగారావును విఆర్ కు బదిలీ చేసి అతని స్థానంలో సిసిఎస్ సిఐ జగదీష్ కు ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించారు సిసిఎస్ బాధ్యతలను దిశ మరియు ఈగల్ టీం ఇన్చార్జి సుధాకర్ కు అప్పగించారు. నగరంలో ఇప్పటివరకు ట్రాఫిక్ లో ఉన్న సేమ్ పాండురంగారావును విఆర్ కు బదిలీ చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిఐల స్థాన చలనం జరిగింది. మరోవైపు తిరుపతి పి టి సి లో ఉన్న సిఐ జగన్మోహన్ రెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు చేయడం జరిగింది