మేడ్చల్: కూకట్పల్లిలోని జేఎన్టీయూ బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నేతలు
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి లోని జేఎన్టీయూ బందుకు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చి విజయవంతం చేశారు. వర్సిటీ విద్యార్థులతో కలిసి తరగతులను బహిష్కరించి క్లాస్ రూమ్ కాంప్లెక్స్ నుంచి వర్సిటీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.