రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం సింహాద్రిపురం, వేముల, చక్రాయపేట మండలంలో వైసీపీ మండల నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో జరిగే నష్టాలను ప్రజలకు వివరించి సంతకాలు చేయించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.