దర్శి: తళ్ళూరు మండలంలోని రైతులకు పలు సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు
Darsi, Prakasam | Oct 18, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి ఏవో ప్రసాదరావు పలు సూచనలు చేశారు. శనగ విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి 25 శాతం రాయితీతో శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్వింటాదరా 7800 కాగా 1950 రూపాయలు ప్రభుత్వ రాయితీ ఇస్తుందని మిగిలిన 5850 చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతులు తగిన పత్రాలు తీసుకొని ఆయా గ్రామాల వ్యవసాయ సహాయకుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు.