ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగానని మందుబాబులు మరియు యువకులతో పోలీసులు బుధవారం ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా మద్యం తాగుతున్న బహిరంగ ప్రదేశాలను గుర్తించిన పోలీసులు మందుబాబులు మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పోలీసులు పరిశుభ్రం చేశారు. అలానే మందు బహిరంగ ప్రదేశాలలో తాగమని యువకులు మరియు మందుబాబులతో ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.