మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో శుక్రవారం కనుమ పండగ కనుల పండగ జరిగింది. సాయంత్రం నుంచి గ్రామాలలో పారువేట కార్యక్రమాన్ని నిర్వహించి పరుగు పందెంలో సత్తా చాటిన యువకులకు నగదు బహుమతులను అందజేశారు. అంతేకాకుండా సీతా అమ్మవారు మరియు రాములవారు ఆంజనేయస్వామి విగ్రహాల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు.