నగరి: భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నగరి MLA భాను ప్రకాష్
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నగరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ మంగళవారం సూచించారు. నీటి ముంపు ప్రాంతాలు, విద్యుత్ వైర్లు తెగిన చోట్లకు ప్రజలు వెళ్లరాదన్నారు. చిన్నారులు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షంతో ఇబ్బందులు తలెత్తితే స్థానిక గ్రామ సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలకు సమాచారం అందించాలని కోరారు.