మెదక్: ఆధార్ కార్డు మార్పుల కోసం ఆధార్ కేంద్రం వద్ద మహిళల కష్టాలు
Medak, Medak | Sep 16, 2025 ఆధార్ కార్డు మార్పుల కోసం ఆధార్ కేంద్రం వద్ద మహిళల కష్టాలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాల వద్ద మంగళవారం ఉదయం మహిళలు బారులు తీరారు. ఆధార్ కార్డులో మార్పు చేయించుకోవడానికి వారు ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అడ్రస్ ఉన్న ఆధార్ కార్డులను కొందరు కండక్టర్లు అంగీకరించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉదయం 6 గంటల నుంచి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని మహిళలు తెలిపారు.