ముక్తాపురం జంక్షన్ వద్ద కారును ఢీకొన్న లారీ, కర్ణాటక కు చెందిన నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి అత్యంత విషమం
Anantapur Urban, Anantapur | Nov 2, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కనగానపల్లి మండలం ముక్తాపురం జంక్షన్ వద్ద బెంగళూరు వైపు వెళుతున్న కారును భారీ వాహనం ఢీకొన్న ఘటనలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హిరినాగకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 1033 నేషనల్ హైవే అథారిటీ వారి ఆంబులెన్స్ తో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.