తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం గ్రామంలో పాముకాటుకు గురై వెంకటేష్ అనే వ్యక్తి తీవ్రస్వస్థకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే కేవీపీ పురం గ్రామానికి చెందిన వెంకటేష్ పొలంలో పనులు ముగించుకుని వస్తూ ఉండగా ఓ విషపు సర్పం కాటు వేయడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు